నిర్మల్ నుండి 6 జ్యోతిర్లింగాల యాత్ర..

22-10-2026 | 05:37pm

నిర్మల్, అక్టోబర్ .22( విజయ క్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి ఈ నెల 27  వ తేదీ  రోజు 6 జ్యోతిర్లింగాలు(Jyotirlingas) 14 పుణ్యక్షేత్రాల యాత్ర బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజట్ కే పండరి(Pandari, the Depot Manager) తెలిపారు. ఈ  బస్సు 27 వ తేదీ మధ్యాన్నం 2 గంటలకు నిర్మల్ నుండి బయలుదేరి మహారాష్ట్ర లోని అవుండా నాగనాథ్,భద్రమారుతి,

ఎల్లోర గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకొని శని సిగ్నాపూర్, షిర్డీ, నాసిక్,  త్రయంభజేశ్వర్ జ్యోతిర్లింగం దర్శంచుకొని గుజరాత్ లో గల నిష్కలంక మహాదేవ్, దర్శనం అనంతరం సోమనాథ్ జ్యోతీర్లింగం దర్శించుకొని శ్రీ కృష్ణుడు ఏలిన రాజ్యం ద్వారకా చూసి నాగ నాగేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం తర్వాత ఉజ్జాయిని జ్యోతిర్లింగం ఓంకారీశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకొని నవంబర్ 2 న అంటే 7 రోజులకు నిర్మల్ చేరుకుంటుంది.

ఛార్జి ఒకరికి 8640/- రూ!! లు 7 రోజుల యాత్ర ఉంటుందని డిపోమేనేజర్ తెలిపారు.మరిన్ని వివరాలకు 9959226003, 9440018549 లో సంప్రదించాలని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు