సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
ముకరంపుర, సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): కరీంనగర్(Karimnagar) లో స్థానిక ప్రకాశం గంజి ప్రాంతంలోని వర్తక వాణిజ్య వ్యాపారుల చే అయోధ్య రామ ధార్మిక సేవ(Religious Service) సంస్థ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడింది.
భక్తి , భజన , ఆధ్యాత్మిక , సేవ అనే నాలుగు ప్రధానాశయాలతో శ్రీరామ తత్వాన్ని, హనుమత్ తత్వాన్ని ,ప్రేమతత్వాన్ని, మానవతా విలువల్ని పెంపొందించే సదుద్దేశంతో గత నాలుగు దశాబ్దాలకు పైగా సమస్త దేవతలను స్మరిస్తూ శ్రీ అయోధ్య రామా ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సామూహిక సత్సంగము, భజన ,సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నలుమాచు చంద్రశేఖర్ తెలియజేశారు.
భావి భారత తరాలకు మన సంస్కృతి,సంప్రదాయాలను అందించాలని కోరారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వరసిద్ధి వినాయక మండపం వద్ద శ్రీ అయోధ్య రామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్సంగము భజన కార్యక్రమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు నలుమాచు చంద్రశేఖర్ రాణి, దండె రాజశేఖర్, తాటిపల్లి సతీష్ బాబు, వెలిచాల చంద్రమోహన్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.