తొలి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు

19-10-2026 | 03:19pm

సాలూర బిడ్డకు ఘన సన్మానం

సాలుర,(విజయక్రాంతి): నీట్‌లో ప్రతిభ చాటిన కండెల సాత్విక.. విద్యార్థినిని అభినందించిన సహకార సంఘం చైర్మన్ అల్లె జనార్ధన్(Cooperative society chairman Allee Janardhan), కుటుంబ సభ్యులు, స్నేహితులు, తొలి ప్రయత్నంలోనే నీట్‌ పరీక్ష(NEET exam)లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ కోర్సుకు ఎంపికైన సాలూర గ్రామానికి చెందిన కండెల సాత్వికను సోమవారం ఘనంగా సన్మానించారు. సాత్విక సాధించిన విజయంతో గ్రామానికి గర్వకారణంగా నిలిచిందని పలువురు అభినందించారు.

ఈ సందర్భంగా సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం(Salur Primary Agricultural Cooperative Society Office)లో సంఘం చైర్మన్‌ అల్లె జనార్ధన్‌, విద్యార్థిని తండ్రి శ్రీనివాస్‌, ఆమె సహాధ్యాయులు, స్నేహితులు కలిసి సాత్వికను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ అల్లె జనార్ధన్‌ మాట్లాడుతూ.. సాలూర గ్రామానికి చెందిన సాత్విక తొలి ప్రయత్నంలోనే నీట్‌ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌ సీటు సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. పట్టుదల, కృషితో లక్ష్యాన్ని సాధించిన సాత్విక యువతకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఆమె భవిష్యత్తులో వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. సాత్వికతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు కండెల గంగాధర్‌, ముట్టెన్‌ గంగారాం, ఎల్మ దత్తాద్రి, నర్సింలు, గోపాల్‌, సొక్కం సాయిలు, కందిమల్ల హన్మండ్లు, హబీబ్‌, గంగాధర్‌, మంజుల, సహకార సంఘం కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు