విజయదశమి ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలి

19-10-2026 | 03:30pm

ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు 

కాగజ్నగర్,(విజయక్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్(Kagaznagar) పట్టణంలోని త్రిశూల్ పహాడ్ పై  ఈనెల 20 నిర్వహించే విజయదశమి ఉత్సవాల్లో(Vijayadashami celebrations) భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీ  బాబు  పిలుపునిచ్చారు. సోమవారం విజయదశమి  ఉత్సవాల నిర్వహణపై శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ(Sri Satyanarayana Swamy Temple) కమిటీ నిర్వాహకులతో చర్చించారు.

మంగళవారం సాయంత్రం 5 గంటలకు శమీ పూజ నిర్వహించబడుతుందన్నారు . అనంతరం రాత్రి 8 గంటల సమయంలో  రావణ దహన  కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువ మంచ్ నిర్వాహకులు పవన్ బలదేవ, చిలువేరు ప్రవీణ్ కుమార్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు