రావణుడి తలల్లో అంతర్జాతీయ ప్రముఖులు

19-10-2026 | 03:52pm

లక్నోలో దసరా పోస్టర్ల కలకలం.. 

రావణుడి పది తలలపై వీళ్ల ఫొటోలేంటి? లక్నో పోస్టర్లతో రచ్చ!

లక్నో: దసరా పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఏర్పాటు చేసిన వివాదాస్పద పోస్టర్లు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. టెస్లా CEO ఎలాన్ మస్క్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సహా పలువురు ప్రముఖుల ఫొటోలను రావణుడి పది తలల రూపంలో ప్రదర్శించడం చర్చకు దారితీసింది. ‘సనాతన రక్షా సంఘటన్’ అనే సంస్థ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

‘భారత వ్యతిరేక పది తలల రావణుడు’, ‘సనాతన భారత వ్యతిరేక రావణుడు’ వంటి నినాదాలతో ఉన్న ఈ పోస్టర్లలో అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్, అంతర్జాతీయ పెట్టుబడిదారు జార్జ్ సోరోస్, బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ యూనస్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో పాటు అతీక్ అహ్మద్, ముఖ్తార్ అన్సారీ చిత్రాలను కూడా చేర్చారు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే నేపథ్యంలో, తమ అభిప్రాయాల ప్రకారం దేశానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకులుగా భావించిన వ్యక్తులను ఇలా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఈ Posters వెలుగులోకి రావడంతో స్థానికంగా Political Controversy మొదలైంది. ముఖ్యంగా అఖిలేశ్ యాదవ్ ఫొటోను చూసిన సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దేశీయ రాజకీయ నేతలతో పాటు అంతర్జాతీయ ప్రముఖుల పేర్లు కూడా ఇందులో ఉండటంతో Social Mediaలో చర్చ విస్తరించింది. పండుగ సంప్రదాయాన్ని రాజకీయ వ్యాఖ్యలకు వేదికగా మార్చిన ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు