యువ నాయకత్వానికి కొత్త బాధ్యత
భిక్కనూర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం ఇసన్నపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా (Youth Congress President) మంద బాబు ఎన్నికయ్యారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరాం వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీరాం వెంకటేష్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లో (Politics) చురుకుగా పాల్గొంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల రాములు, యాదగౌడ్, తిరుమల స్వామి, గుడిసె నారాయణ, సందని స్వామి, పరుశరాములు, నర్సింలు, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడు మంద బాబుకు శుభాకాంక్షలు (Congratulations) తెలిపారు.