సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
05-10-2026 | 08:48pm
అనారోగ్యంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీర్కూర్ మండల కేంద్రంలో అనారోగ్య సమస్యతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి(Software Employee) అఖిల్(29) తమ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. అఖిల్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా బీర్కూర్ లో ఇంటివద్దనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటున్నాడు. కడుపునొప్పి భరించలేక, ఆత్మ హత్య చేసుకున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.