ఆశా వర్కర్ల అలవెన్స్ అందేదెప్పుడు..?

09-09-2026 | 09:47am

చందుర్తి,సెప్టెంబర్ 09,(విజయక్రాంతి):పల్స్ పోలియో(Pulse Polio) డ్యూటీ చేసే సిబ్బందికి అలవెన్స్(allowance) ఇంకా అందలేదని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్లు(ASHA workers ) పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో డ్యూటీ చేస్తారు. వారికి నేరుగా నెలవారీ జీతం అంటూ ప్రత్యేకంగా ఉండదు. నేషనల్ హెల్త్ మిషన్ National Health Mission) నిబంధనల ప్రకారం, పోలియో చుక్కలు వేసే రోజుల్లో వీరికి రోజువారీ అలవెన్స్ లేదా ఇన్సెంటివ్స్ రూపంలో ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. పోలియో బూత్‌లలో విధులు నిర్వహించే వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బందికి రోజుకు 200 నుండి 250 వరకు  ప్రభుత్వ నిబంధనల ప్రకారం లభిస్తుంది.

మండలంలోని ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం నుండి బడ్జెట్ విడుదలైనా, స్థానిక ఆరోగ్య అధికారులు సమయానికి వారి ఖాతాల్లో జమ చేయకపోవడం ఏంటని వర్కర్లు వాపోతున్నారు. పోలియో కేంద్రాలు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు అలవెన్స్ అందలేదు.  ఈ అలవెన్స్ లు అందకపోవడంలో మతలబ్ ఏంటి ఎవరి దగ్గర ఈ డబ్బులు ఉన్నాయనే  అనుమానం రాకపోలేదు.ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారి  స్పందించి  తక్షణమే వారికి అలవెన్స్ అందేలా చూడాలని ఆశ వర్కర్లు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.  ఈ విషయమై డాక్టర్ సంపత్ ను వివరణ కోరగా  రెండు మూడు రోజుల్లో ఆశా వర్కర్ల ఖాతాలో జమ అవుతాయని,  చెబుతున్నారు.

మరిన్ని వార్తలు