కడ్తాల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కడ్తాల్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం(MRO Office)లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(Kasireddy Narayana Reddy) స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా మంజూరైన దాదాపు 14,000 స్మార్ట్ రేషన్ కార్డు(Smart Ration Card)ల్లో భాగంగా తహసీల్దార్ కే. జయశ్రీతో కలిసి 20 మంది లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా ప్రభుత్వ ఫలాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అక్కడి నుంచి స్థానికంగా జరిగే కాటమయ్య బోనాల సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కాటమయ్య స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ సుజాత, సర్పంచ్ బిక్షపతి, ఏఎంసీ చైర్మన్ గీతా, మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పోతుగంటి శంకర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, చేగురి వెంకటేష్, జాంగిర్ అలీ, చందోజీ, స్థానిక అధికారులు, అశోక్, నాయకులు పాల్గొన్నారు.






