5 September, 2026 | 4:20 PM

డీసీఎస్‌ సర్వేను పరిశీలించిన అధికారులు

05-09-2026 | 02:14pm

నాగల్‌గిద్ద, సెప్టెంబర్‌ 5 (విజయక్రాంతి): మండలంలోని గౌడ్‌గావ్‌ జన్వాడ, ఔదత్‌పూర్‌ గ్రామాల్లో కొనసాగుతున్న డీసీఎస్‌ సర్వే(DCS Survey) పనులను ఎంఏఓ(MAO) ప్రవీణ్‌చారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే(Survey) ప్రక్రియలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించి, వివరాల నమోదు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సంబంధించిన వివరాలు, భూముల సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని సర్వేయర్లకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈఓ సంతోష్‌తో పాటు సర్వేయర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు