5 September, 2026 | 6:44 AM

కంకణబద్ధులమై పనిచేస్తున్నాం

05-09-2026 | 05:25am
  1. అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
  2. నాణ్యత విషయంలో రాజీ పడొద్దు 
  3. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
  4. హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్, మద్దూరులో అభివృద్ధి పనుల పరిశీలన

కొడంగల్/మద్దూర్, సెప్టెంబర్ 4: ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి ఒక్కరి క్షేమం కోసం పరితపిస్తూ కంకణబద్ధులమై పనిచేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy,) అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా(Narayanpet district) కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్ మున్సిపాలిటీ(Maddur Municipality)లో పలు అభివృద్ధి పనుల(development work)ను పరిశీలించారు. దౌలతాబాద్ మండలం గోఖ పస్లావాద్ గ్రామంలో బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల(BC Welfare Residential School), దౌల్తాబాద్ మండల్ కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల భవనాల నిర్మాణ పనులు, హకీంపేటలో చేపట్టే ఎడ్యుకేషన్ హబ్(Education Hub) పనులను పరిశీలించారు.

ఎడ్యుకేషన్ హబ్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ స్కూల్(Young India Integrated Residential School), ప్రభుత్వ మెడికల్ నర్సింగ్(Government Medical Nursing), ఫిజి యో థెరపీ, పారామెడికల్ కాలేజీలు, 430 బెడెడ్ హాస్పిటల్, ఇతర నిర్మాణాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. ఎడ్యుకేషన్ హబ్‌లో జరిగే అన్ని నిర్మాణాల విషయంలో సమన్వయంతో పనిచే యాలని అధికారులకు సూచించారు. నిర్మాణాల్లో నాణ్యత, ఇతర సాంకేతిక అంశాల విషయాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించంచారు.

వర్షాల సమయంలో నీరు నిలవకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్‌ను ఏ ర్పాటు చేయాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి ల్యాండ్ స్కేపింగ్ పనులకు వినియోగిం చుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మద్దూర్ మున్సిపాలిటీలో కళాశాల భవన నిర్మాణ నమూనా చిత్రపటాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలలు తదితర వివ రాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మొత్తం 4 ఎకరాల స్థలంలోని 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐ డీసీ ఎండీ గణపతిరెడ్డి సీఎంకు వివరించారు. అనంతరం భవనం లోపల జరుగు తున్న నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. కళాశాల భవనం పక్కన ప్రధాన రహ దారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రియాం కకు సూచించారు.

వచ్చే మార్చి నెలలోపు కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అ ధికారులను ఆదేశించారు. మద్దూరు ప్రాం తంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడు వులోగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం చింతల్ దిన్నే వైపు కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు.

నిర్మాణ పనులను నాణ్యతా ప్ర మాణాలతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులని, నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తప్పవని సీఎం అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని, వేగంగా పనులు జరగాలని నాణ్యత విషయంలో రాజీ ప్రతి పడవద్దని సూచించారు. పనులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే బా ధ్యులపై చర్యలు తప్పవని సిఎం హెచ్చరించారు.

గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థ లం ఇచ్చిన దాతలకు  ఇందిరమ్మ  ఇండ్లు మంజూరు చేయాలన్నారు. సీఎం వెంట ప్ర ధాన కార్యదర్శి శ్రీధర్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, మద్దూర్ మున్సిప ల్ చైర్ పర్సన్ సరస్వతీజనార్ధన్, మద్దూరు మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్ విం డో  చైర్మన్ నర్సిములు, వీరేశ్ గౌడ్ ఉన్నారు. 

మరిన్ని వార్తలు