5 September, 2026 | 10:48 AM

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువుల పాత్ర అమూల్యం

05-09-2026 | 10:07am

సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఉపాధ్యాయుల పాత్ర చిరస్మరణీయం 

హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం(Teachers' Day 2026) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు(Teachers Day Greetings) తెలియజేశారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి(Dr. Sarvepalli Radhakrishnan Jayanti) సందర్భంగా రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. జ్ఞానాన్ని, వివేకాన్ని అందిస్తూ నిత్యం స్ఫూర్తినిస్తూ, మార్గనిర్దేశం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువుల పాత్ర అమూల్యం అన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. దేశ ప్రగతికి బాటలు వేసే గురువుల జ్ఞానం, మార్గదర్శనం, అంకితభావం, స్ఫూర్తి.. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు