సమ్మక్క సాగర్‌కు అనుమతివ్వండి
- ముంపు పరిహారం ముందుగానైనా చెల్లిస్తాం
- రెండు రాష్ట్రాల ప్రయోజనాలే మాకు ముఖ్యం
- 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం
- ఢిల్లీలో -ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ
- ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్‌వోసీ ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : సమ్మక్కసారక్క బరాజ్(Sammakka Sarakka Barrage,) (సమ్మక్క సాగర్ ప్రాజెక్టు) కు వీలైనంత త్వరగా ఎన్‌వోసీ ఇవ్వాలని తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని(Chhattisgarh Government) కోరారు. ఛత్తీస్ గఢ్‌లో ముంపు నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైతే పరిహారం ముందుగానే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
రెండు రాష్ట్రాల ప్రయో జనాల కోసం పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పెండింగ్ అంశాలను(pending issues) పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయితో(Vishnu Deo Sai) మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సా గర్‌కు సంబంధించిన అంతర్రాష్ట్ర అంశాలు, బ్యాక్‌వాటర్ ప్రభావం, ముంపునకు గుర య్యే భూములు, నివాస గృహాలు, బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, ఛత్తీస్‌గఢ్ నుంచి పెండింగ్‌లో పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు.
సమ్మక్క సాగర్ బరాజ్ నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అ న్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ‘ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గుర య్యే భూములు, ఇళ్లకు తెలంగాణ ప్రభు త్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుంది.
అవసరమైతే పరిహారం నిధులను ముందుగానే జమ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం..’ అని తెలిపారు. బరాజ్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు వీలుగా ఛత్తీస్‌గ ఢ్ ప్రభుత్వం త్వరగా ఎన్‌ఓసీ జారీ చేయాలని, రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం స మస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అని పేర్కొన్నారు.
46.96 టీఎంసీల నీటి మళ్లింపు లక్ష్యం..
సాగునీటి అవసరాల కోసం గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించడం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దేవాదుల ఎత్తిపోతల పరిధిలోని కొంత ఆయకట్టును స్థిరీక రించడం, మార్గమధ్యంలోని గ్రామాల తాగునీటి అవసరాలు తీర్చడం కూడా ప్రాజెక్టు లక్ష్యాల్లో భాగంగా ఉందన్నారు.
శ్రీరాంసాగర్ రెండో దశ పరిధిలోని ఐదు జిల్లాల్లో మొత్తం 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా ప్రతిపాదించారని, ఇందులో సూర్యాపేట జిల్లాలో 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 96,494 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85,774 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 22,422 ఎకరాలు, జనగామ జిల్లాలో 1,111 ఎకరాల ఆయకట్టు ఉందని ఆయన వివరించారు.
రామప్ప అనుసంధాన కాలువ కింద ములుగు జిల్లాలో 8 వేల ఎకరాలు, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవ ర్గంలో 22 వేల ఎకరాలు కలిపి మొత్తం 30 వేల ఎకరాల కొత్త ఆ యకట్టుకు సాగునీరు అందించనున్నారని, ఈ విధంగా పాత ఆయ కట్టును స్థిరీకరించడంతోపాటు కొత్త ప్రాంతాలకు సాగునీరు అం దించే కీలక ప్రాజెక్టుగా సమ్మక్క సాగర్ నిలవనుందని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌ఓసీతోనే ఇతర అనుమతులు
సమ్మక్క సాగర్‌కు మూలమైన పీవీ నరసింహారావు కంతనపల్లి-సుజల స్ర వంతి పథకానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 లో అనుమతి లభించిందని, తెలంగాణ ఏర్పడిన అనంతరం చేపట్టిన రీఇంజినీరింగ్‌లో భాగంగా బరాజ్ నిర్మా ణ స్థలాన్ని తుపాకులగూడెంకు మార్చారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రాజెక్టుకు 2017లో పరిపాలన అనుమతులు రాగా, 2020లో దీనికి సమ్మ క్క సాగర్‌గా నామకరణం చేశారని, 2024 డిసెంబర్‌లో సవ రించిన పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయని పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు 2020లో పర్యావరణ అనుమతి లభించగా సమగ్ర ప్రాజెక్టు నివేదికను 2021 ఆగస్టులో కేంద్ర జల సంఘానికి సమర్పించారని, ఇప్పటికే పలు సాంకేతిక అను మతులు లభించినప్పటికీ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ రాకపోవడంతో అంతర్రాష్ట్ర అంశాల పరిశీలన పెండింగ్‌లో ఉందన్నారు. సమ్మక్క సాగర్ బరాజ్ కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.9.883 కోట్లను బీజాపూర్‌లోని ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు చెల్లించిందని వెల్లడించారు.
పూర్తి జలాశయ మట్టం, అత్యధిక వరద నీటిమట్టానికి సంబంధించిన డీజీ పీఎస్ సర్వేలు పూర్తయ్యాయని ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖ 2026 ఆగస్టు 7న తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసిందని, ప్రస్తు తం లైడార్ డ్రోన్ సర్వేలతోపాటు క్షేత్రస్థాయి సమాచార సేకరణ కొనసాగుతున్నట్టు వి వరించారు.
ఈ అధ్యయనాల ఆధారంగా ముంపు ప్రభావిత ప్రాంతాలు, భూము లు, ఇళ్లు, ఇతర ఆస్తుల వివరాలను నిర్ధారించి పరిహార ప్రక్రియను ముందుకు తీ సుకెళ్లనున్నామని తెలిపారు. సమ్మక్క సా గర్ ఎన్‌ఓసీ అంశంపై ఇప్పటికే పలుమా ర్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కోరామని, తాజాగా మరోసారి ఎన్‌వోసీ జారీని వే గంగా చేయాలని జారీ విజ్ఞప్తి చేశారు. ఇం దుకు చొరవచూపాలని ఛత్తీస్‌గఢ్ సీఎం ను కోరారు.






