కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మున్సిపాలిటీల అభివృద్ధి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayan Reddy) అన్నారు. శనివారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వార్డుల్లో రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మున్సిపల్ పాలకవర్గంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇచ్చే హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని చెప్పారు. నిధులు తీసుకువచ్చి అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గీత, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గీత, కౌన్సిలర్లు రమేష్, మహేష్,వెంకటయ్య, జగన్, రాము అనూష,అనిత శ్రీశైలం, అల్లాజీ గౌడ్, ఖాదర్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శివలింగం, నాయకులు కేశవులు మానయ్య, మల్లయ్య,వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.