వనరుల సమీకరణతో ఆదాయ వృద్ధి

04-10-2026 | 05:30am
  1. పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ భూముల విలువ పెంపు 
  2. కీలక ఆదాయ వనరుగా పర్యాటక రంగం    
  3. ఉన్నతస్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి  
  4. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు

అక్టోబర్ 3 (విజయక్రాంతి) : అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని ఆదా యం సమకూర్చుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)తెలి పారు. ఇందులో భాగంగా హిల్ట్ పాలసీ అ మలు, పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలి పారు. సచివాలయంలో శనివారం భట్టి విక్రమార్క అధ్యక్షతన వనరుల సమీకరణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సంజయ్ జాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్య వస్థను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వ భూములను సమర్థవంతంగా వినియోగించుకోవడం, వాటి విలువను పెంచడం, పెట్టు బడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం, పర్యాటక రంగంలో ప్రైవేట్ భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై  కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వ ఆస్తులు, భూ ముల ద్వారా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం పొం దేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

హిల్ట్ పాలసీలో అభ్యంతరాలు లేని పార్కులకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిశీలిం చి త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వేగం గా సమీకరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. హిల్ట్ పాలసీపై పరిశ్రమలకు మరింత అవగాహన కల్పించేందుకు ఆరు పార్కుల్లో మంత్రుల ఆధ్వర్యంలో రోడ్‌షోలు నిర్వహించాలని సూచించారు.

గ్లోబల్ సమ్మిట్‌కు 7,080 పర్యాటక ప్రాజెక్టులు

పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రాజెక్టులను సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గతంలో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను వివరించినప్పుడు సుమారు రూ.30 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పర్యాటక రంగంలోని అవకాశాలను గ్లోబల్ సమ్మిట్‌లో  ప్రదర్శించేందుకు 7,080 ప్రా జెక్టులను సిద్ధం చేయాలని సీఎస్‌కు సూచించారు.

పర్యాటక ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలను గుర్తించి, పెట్టుబడిదారులను ఆకర్షించేలా ప్రతిపాదనలు రూపొందించాలని, టైగర్ టూరిజం కార్యక్రమాలను వెంట నే ప్రారంభించాలని, నిజాంసాగర్‌లోని నిజాం గెస్ట్‌హౌస్‌ను పర్యాటక అవసరాలకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూ చించారు. పర్యాటక మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కారవాన్ పార్కుల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.

రాష్ట్రంలోని చారిత్రక కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు పీపీపీ విధానంలో 11 కోటలకు బిడ్లు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్ప ల్,  వివిధ శాఖల ఉన్నత అధికారులు శశాం క, కృష్ణ భాస్కర్, ఇలంబర్తి, నిఖిల్ చక్రవర్తి, లోకేష్ కుమార్, కృష్ణ ఆదిత్య, సర్ఫరాజ్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు