సమాజ సేవలో ముందుండాలని పిలుపు

24-10-2026 | 01:26pm

పటాన్‌చెరు, అక్టోబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్(GITAM Deemed) విశ్వవిద్యాలయంలో రోటరాక్ట్ క్లబ్ 2026–27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రోటరాక్ట్ ఛైర్మన్(Rotaract Chairman) డాక్టర్ జి.ఎస్.ఎస్. ప్రకాష్(G.S.S. Prakash), ఆత్మీయ అతిథిగా రొటేరియన్ జె. యోగేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ సమాజ సేవలో చురుకుగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నూతన సభ్యులకు స్వాగతం పలికి, కార్యవర్గ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. క్లబ్ వార్షిక ప్రణాళికను కూడా ఆవిష్కరించారు. ఐరిస్ హైదరాబాద్ రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ క్లబ్, విద్యార్థుల్లో సేవాభావం, జట్టు స్ఫూర్తి, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ కార్యక్రమంలో గీతం విశ్వవిద్యాలయ అధికారులు, రోటరీ, రోటరాక్ట్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు