గజ్వేల్ బీజేపీలో నూతన బాధ్యతలు
గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో బీజేపీని మరింత బలోపేతం చేసి, ప్రజా సేవలో ముందుండేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ పిలుపునిచ్చారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు(Medak MP Madhavaneni Raghunandan Rao) మార్గదర్శకత్వంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, గజ్వేల్ పట్టణ ప్రభారి కప్పర ప్రసాద్‌రావు సూచనల మేరకు నూతన మోర్చాలు, సెల్‌లకు బాధ్యతలు ప్రకటించారు.
మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మంతూరి మమత, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కొమ్ము చంద్రశేఖర్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా కేతావత్ ఆంజనేయులు, బీసీ మోర్చా అధ్యక్షుడిగా శ్రీరాం కృష్ణ ముదిరాజ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా సంగెపు అనిల్, యువ మోర్చా అధ్యక్షుడిగా గడియారం రాజేశ్వర్ చారి నియమితులయ్యారు. సోషల్ మీడియా కన్వీనర్‌గా వ్యాసబట్టు వేణుగోపాలరాజు, ఐటీ సెల్ కన్వీనర్‌గా సందిరి రాజు, మీడియా సెల్ కన్వీనర్‌గా కాళ్ల సంపత్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలతో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేసి క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలని మనోహర్ యాదవ్ కోరారు.