మార్కెట్‌ యార్డు గేట్లు తెరవాలి

23-10-2026 | 05:17pm

నంగునూరు, అక్టోబర్ 23 (విజయక్రాంతి):నంగునూరు వ్యవసాయ మార్కెట్ యార్డు(Nangunuru Agricultural Market Yard) గేట్ల కు వేసిన తాళాలను వెంటనే తొలగించి, రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పరకాల తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోగా స్పందించకపోతే రైతన్నల తో కలిసి మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.గ్రామాల్లో కల్లాలు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని మార్కెట్‌ యార్డుకు తెచ్చి ఆరబోసుకుంటున్నారు.అధికారులు మాత్రం ముందుగా ధాన్యం ఆరబెట్టుకున్నాకే యార్డుకు రావాలని చెప్పి గేట్లకు తాళాలు వేయడం సరికాదన్నారు. తక్షణమే స్పందించి యార్డు గేట్లు తెరవాలని, లేదంటే  ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు