మహిళల టీటీ జట్టు కెప్టెన్‌గా శ్రీజ
- కోచ్‌గా సోమనాథ్ ఘోష్
- ఆసియా క్రీడలకు సన్నద్ధం
హైదరాబాద్, సెప్టెంబర్ 4 : ఆసియా క్రీడలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే భారత క్రీడాకారులు(Indian athletes) ముమ్మరంగా సాధన చేస్తున్నారు. తాజాగా మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు కెప్టెన్‌గా(Womens table tennis team captain) తెలంగాణ స్టార్ ప్లేయర్ ఆకుల శ్రీజ(Akula Sreeja) ఎంపికైంది. రానున్న ఆసియా క్రీడల్లో(Asian Games) మహిళల జట్టును(womens tea) ఆమె లీడ్ చేయబోతోంది. అలాగే భారత టీటీ కోచింగ్ బృందంలో(Indian TT coaching team) సోమనాథ్ ఘోష్(Somnath Ghos) కూడా ఎంపికయ్యాడు.
దియా పరాగ్ చితాలే, సిండ్రెల్లా దాస్, యశస్విని దీపర్ ఘోర్పాడే, సుతీర్ధ ముఖర్జీ వంటి బలమైన ప్లేయర్స్‌తో ఉన్న మహిళల జట్టును శ్రీజ నడిపించబోతోంది. జట్టు కెప్టెన్సీతో పాటు సింగిల్స్, టీమ్, డబు ల్స్ విభాగాల్లో శ్రీజ బరిలోకి దిగుతోంది. ఆసియా క్రీడల లాంటి పెద్ద ఈవెంట్‌లో జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని శ్రీజ చెప్పింది. అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి ప తకాలు అందించడమే లక్ష్యంగా పేర్కొంది.
శ్రీజకు కోచ్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్ ఘోష్ భారత జట్టు కోచింగ్ బృందంలో కీలక పాత్ర పోషించనున్నాడు. శ్రీజతో పా టు భారత టీటీ జట్లు మంచి ప్రదర్శన కనబరుస్తాయన్న నమ్మకం ఉందని సోమనాథ్ ఘోష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ టీటీ అసోసియేషన్ అందించిన మద్ధతుకు కృతజ్ఞతలు తెలిపాడు.






