నేటి నుంచే రంజీ ట్రోఫీ
15-10-2025
హైదరాబాద్,అక్టోబర్ 14 : దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ టోర్నీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 91వ ఎడిషన్ బుధవారం నుంచే ఆరం భం కానుంది. దేశవ్యాప్తంగా మొత్తం 32 జట్లు రంజీ బరిలో ఉండగా.. ప్రతీ గ్రూప్లో 8 జట్లు పోటీపనన్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి టాప్ 2 లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. గత సీజన్లో విదర్భ చాంపియన్గా నిలిస్తే.. కేరళ రన్నరప్గా నిలిచింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై ఏకంగా 42 సార్లు విజేతగా నిలిచింది. ఈ సారి పలువురు స్టార్ క్రికెటర్లు సైతం రంజీ సీజన్ ఆడుతున్నారు. రహానే, సంజూ శాంసన్, షమి, ఇషాన్ కిషన్, కరుణ్ నాయర్, రింకూ సింగ్, తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే,సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్ వంటి ప్లేయర్స్ ఆడుతున్నారు. హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.