100 పడకల ఆసుపత్రి నిర్మాణం
- నిధులు వెంటనే మంజూరు చేయాలి
- బీజేపీ తెలంగాణ దివ్యాoగుల విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గోలి ప్రభాకర్
తుంగతుర్తి( విజయ క్రాంతి): 2024 ప్రారంభం లో 45 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఆసుపత్రికి ఇప్పటి వరకు అరకొర నిధులు మాత్రమే మంజూరయ్యాయని బిజెపి దివ్యాంగుల విభాగం రాష్ట్ర కోకన్వీనర్ గోలి ప్రభాకర్(Goli Prabhakar State Co-convener of the BJP’s Divyang) ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల మంజూరు జాప్యం కారణంగా అప్పులు తీసుకొని వచ్చి పనులు చేపడుతున్నట్టు విమర్శించారు.
అదే విదంగా వెలుగుపల్లి చౌరస్తా నుండి రావులపల్లి గ్రామం వరకు రోడ్డు పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయని దుయ్యబట్టారు. రాత్రి వేళలో ప్రమాదాలకు నిలయంగా మారిందని, స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు పట్టించుకోకపోవడం, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడి పోయిందని తెలిపారు.
జిల్లా మంత్రి ఈ విషయంలో వెంటనే తగు చొరవ తీసుకుని ఆసుపత్రి కోసం, వాహనదారుల ప్రయోజనం రోడ్డు కోసం కావాల్సిన నిధులు వెంటనే ప్రభుత్వం ద్వారా మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేసారు లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో నియోజకవర్గం లో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.