హెచ్ఎండీఏ నిధుల వృథాపై బీజేపీ ఆగ్రహం
క్లబ్ రోడ్ అండర్ డ్రైనేజీ పనులపై విచారణకు డిమాండ్
ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి మున్సిపాలిటీ(Bhuvanagiri Municipality)లో హెచ్ఎండీఏ నిధుల(HMDA funds) వినియోగంపై బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగేటి సుచరిత, కౌన్సిలర్లు తుమ్మల యాస్మిన్, బండారు స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం క్లబ్ రోడ్ సమీపంలో రూ.30 లక్షలతో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ప్రణాళిక, నాణ్యత లోపాలతో ప్రజాధనం వృథా అవుతోందని ఆరోపిస్తూ, పనులపై సాంకేతిక తనిఖీ నిర్వహించి, పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనం వృథా చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కారుపాటి రాజు, ఎదుగాని సంతోష్ తదితర బీజేపీ(BJJP) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
