వైభవంగా కార్తీక మహాకోటి దీపోత్సవం

29-11-2026 | 11:06am

ఆదిలాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): కార్తీక మాసం (Karthika Masam) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లో మహాకోటి దీపోత్సవం వేడుకలు (Celebrations) వైభవంగా నిర్వహించారు. శనివారం సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

ముందుగా శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) భక్తులను ఆకట్టుకున్నాయి. వేద పండితులు సంతోష్ శర్మ బృందం మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించింది. మహిళలు పెద్దఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధన చేశారు. వేలాది దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతకు, సమాజంలో సానుకూల వాతావరణానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్, ఎస్పీ అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు కందుల రవీందర్, రవీందర్ రేణికుంట, సంతోష్ అగ్రవాల్, మహిపాల్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు