ఆకాశంలో వణికిపోయిన విమానం
“భారీ భూకంపం వస్తోంది.. ల్యాండింగ్ ఆపేయ్!” – ఆకాశంలో ఉత్కంఠ.. నేలపై వణికిన ఎయిర్‌పోర్ట్!
వాషింగ్టన్: భూమి ఒక్కసారిగా వణికిపోతుంటే, అటు నేలపై ఉన్న వారితో పాటు ఆకాశంలో గాలిలో తేలుతూ విమానం దిగేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికుల పరిస్థితి ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పాటు కలిగిస్తుంది. దక్షిణ కాలిఫోర్నియా తీరంలో శనివారం ఉదయం సంభవించిన 5.0 తీవ్రత భూకంపం వేళ, లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX) వద్ద చోటుచేసుకున్న ఉత్కంఠభరిత క్షణాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
వభూమి బలంగా కంపించడాన్ని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అప్పటికే ల్యాండింగ్ కోసం విమానాశ్రయం వైపు వస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం (Delta Flight 1972) పైలట్‌ను వెంటనే అలర్ట్ చేశాడు. "Delta 1972, go around. Delta 1972, go around. We're having a big earthquake" అంటూ కంట్రోలర్ ఆందోళనతో చెప్పిన మాటలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆడియోలో రికార్డయ్యాయి. ఆ ఆదేశాన్ని పాటించిన పైలట్, వెంటనే ల్యాండింగ్ ప్రయత్నాన్ని విరమించుకుని విమానాన్ని తిరిగి గాల్లోకి మళ్లించాడు.
ఎక్కడ.. ఎప్పుడు కంపించింది?
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వివరాల ప్రకారం, శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. కాలిఫోర్నియాలోని మాన్‌హట్టన్ బీచ్ తీరానికి సుమారు ఆరు మైళ్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. భూకంప ధాటికి లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలోని ఒక టెర్మినల్‌లో గాజు అద్దాలు పగిలిపోయాయి. ప్రకంపనలకు భవనాలు ఊగిపోయిన దృశ్యాలు ఎయిర్‌పోర్ట్ ఫుటేజీలో కనిపించాయి. అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన LAX వద్ద ఈ ఘటన క్షణాల్లో కలకలం రేపింది. అయితే, ఈ భూకంపం వల్ల విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.
EARTHQUAKE🚨: Air traffic controllers at Los Angeles International Airport called off the landing of a passenger airliner just moments before it touched down during Saturday’s earthquake. https://t.co/ao59SOqJQQ
— For all Curious (@fascinatingonX) November 29, 2026