ఆధార్ ఉంటేనే గ్యాస్ సిలిండర్
తెలంగాణలో రూ.500 గ్యాస్ సిలిండర్‌పై కీలక అప్డేట్.. ఆధార్ విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు!
హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద కేవలం రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇకపై ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ వివరాల ధ్రువీకరణ తప్పనిసరి కానుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) జీవో నంబర్ 19ను విడుదల చేసింది. దీంతో రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్న వినియోగదారులు తమ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రేషన్ కార్డుతో ఆధార్ లింక్ తప్పనిసరి!
మహాలక్ష్మి పథకం అమలులో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు నిజమైన అర్హులకే Subsidy ప్రయోజనం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల Aadhaar వివరాలను వారి Food Security Card (రేషన్ కార్డు)తో అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది. ఆధార్ వివరాల ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపును ధ్రువీకరించనున్నారు. ఆధార్ నంబర్ లేని వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ కోసం నమోదు చేసుకున్న Enrollment Receiptతో పాటు ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి పథకం ప్రయోజనం పొందవచ్చు. ఇందుకోసం బ్యాంకు లేదా పోస్టాఫీసు Passbook, PAN Card, Passport, Voter ID, ఉపాధి హామీ కార్డు వంటి పత్రాలను ఉపయోగించుకోవచ్చు.
ఫింగర్‌ప్రింట్ పడకపోతే మరో మార్గం!
ఆధార్ ధ్రువీకరణ సమయంలో వేలిముద్రలు (Fingerprints) సరిపోలకపోతే ప్రత్యామ్నాయ Verification సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం Iris Scan (కంటిపాప గుర్తింపు), Face Recognition (ముఖ గుర్తింపు) ద్వారా వివరాలను ధ్రువీకరించుకునే అవకాశం కల్పించారు. ఇవి కూడా పనిచేయకపోతే ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP లేదా Time-based OTP ద్వారా Verification పూర్తి చేసుకోవచ్చు. అన్ని Verification పద్ధతులు విఫలమైన అత్యవసర పరిస్థితుల్లో ఆధార్ కార్డుపై ఉన్న QR Codeను స్కాన్ చేసి లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఏ ఒక్క అర్హుడూ సాంకేతిక సమస్యల కారణంగా మహాలక్ష్మి పథకానికి దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కాబట్టి రూ.500 Gas Cylinder Subsidy పొందుతున్న వారు తమ ఆధార్, రేషన్ కార్డు వివరాలను సరిచూసుకోవడం మంచిది.