తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి
రైతులను ఆదుకోవాలని బిఆర్ఎస్ నాయకుల వినతి
తలమడుగు,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం(Impact of El Niño)తో వర్షాలు లేక పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బిఆర్ఎస్(BRS) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తలమడుగు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు(Farmers ) పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కుమార్, కన్వీనర్ వెంకటేష్, కేదారేశ్వర రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, తలమడుగు సర్పంచ్ చంటి, రాజేశ్వర్, సునీత రెడ్డి, పల్లవి, రాంబయి, ప్రమోద్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.