చెల్లెలి ప్రశ్నలకు సమాధానం చెప్పని కేటీఆర్

06-11-2026 | 10:03pm

డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఇటీవల జిల్లాకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR ) ముందుగా తన సొంత సోదరి కవిత ఇంద్రవెల్లి సభ లో చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్(DCC President Dr. Naresh Jadhav) డిమాండ్ చేశారు. చెల్లెలి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)పై ఆరోపణలా అని విమర్శించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. జిల్లాను ఐటీ రంగంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు.

ఈనెల 9న మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) చేతుల మీదుగా ఐటీ టవర్ ప్రారంభంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలకు కొత్త మార్గాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను అందిస్తోందని పేర్కొన్నారు. అలాగే దీపావళి పండుగ సందర్భంగా నూతనంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న పేద కుటుంబాలన్నీ తమ ఇళ్లలో సంతోషంగా ఇందిరమ్మ సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, మార్కెట్ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు