బస్సు సర్వీసును యథావిధిగా పునరుద్ధరించాలి
విద్యార్థులు,ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
డాక్టర్ వెన్న ఈశ్వరప్ప
గండీడ్, నవంబర్ 6 విజయక్రాంతి: మండల పరిధిలోని రుసుంపల్లి గ్రామానికి(Rusumpalli Village) బస్సు సర్వీసును(Bus service) యథావిధిగా పునరుద్ధరించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప(Dr. Venna Eshwarappa) పరిగి డిపో మేనేజర్‌ను కోరారు. గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న బస్సు సౌకర్యం గత ఏడాది నుంచి నిలిచిపోయిందని తెలిపారు.
గతంలో ఐనాపూర్–మహబూబ్‌నగర్ బస్సు సర్వీసు(Ainapur–Mahabubnagar Bus Service) ఉదయం 8:30 గంటలకు, సాయంత్రం 5:30 గంటలకు రుసుంపల్లికి వచ్చి వెళ్లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామంలోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బరువైన పుస్తకాల బ్యాగులను భుజాలపై మోస్తూ మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగులు సైతం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రుసుంపల్లి గ్రామానికి బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని డాక్టర్ వెన్న ఈశ్వరప్ప డిపో మేనేజర్‌ను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కొమిరె లక్ష్మయ్య, పెంటయ్య గుప్తా, మహమ్మదాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు మూస నరసింహులు, చిట్యాల యాదగిరి, నస్కల్ మాజీ సర్పంచ్ కాసుల శ్రీనివాస్, తుప్ప విజయ్ కుమార్, జాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.