త్వరలో ఐటీ టవర్‌ ప్రారంభం

19-09-2026 | 05:19pm

పార్టీ శ్రేణులతో కలిసి ఐటీ టవర్‌ను పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సమీపంలోని బట్టి సావర్గాం గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ నిర్మాణ పనులు(IT Tower construction works) పూర్తి కావచ్చాయని, త్వరలోనే దీనిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్(DCC President Naresh Jadhav) వెల్లడించారు. శనివారం జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన  ఐటీ టవర్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించి, పరిశీలించారు. భవన నిర్మాణం, అంతర్గత సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ జాదవ్  మాట్లాడుతూ వెనుకబడిన జిల్లా యువతకు స్థానికంగానే ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఐటీ టవర్‌ను సకల సౌకర్యాలతో నిర్మించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఐటీ విస్తరణకు కంపెనీలు సానుకూలంగా ఉన్నాయనీ, ఇప్పటికే మూడు ప్రముఖ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు, స్థలం కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మరిన్ని కంపెనీలు ఆదిలాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. గతంలో ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, దుర్గం శేఖర్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు