రైతు నెత్తిన ఎల్నినో పిడుగు
చేతి కందేపత్తి పంట ఎండుతున్నది.
దూది రైతుకు పుట్టెడుదుఃఖం.
బోథ్. అక్టోబర్. 23 ( విజయక్రాంతి): చేతికి అందుతుంది అనుకున్న పత్తి పంటపై(Cotton crop) ఎల్ నినో(El Niño) పిడుగు పడింది . ఫలితంగా చేతికి అందుతుంది అనుకున్న పత్తి పంట రైతన్న(Farmer) కండ్ల ఎదుట ఎండిపోతున్నది. ఫలితంగా దూది రైతులకు పుట్టెడు దుఃఖం మిగులుతున్నది.
జిల్లా మొత్తం ఇదే పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా దాదాపు 40000 ఎకరాలలోపత్తి పంట సాగవుతున్నది. అయితే 20 రోజుల క్రితం వరకు ప్రతిపంట బాగానే ఉన్నా వర్షం జాడ లేకపోవడంతో ఎదిగిన పంట ఎండిపోతున్నది. దీంతో రైతుల(Farmer) తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాగునీటి వసతి ఉన్న రైతులలోపత్తి పంటపై ఆశలు చిగురుస్తుండగా సాగునీటి(Irrigation) వసతిలేని రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. కేవలం 10000 ఎకరాలకు మాత్రమే సాగునీటి వసతి ఉండగా మిగితా భూముల్లో సాగునీటి వసతి లేకపోవడంతో పత్తి ఎదగకపోగా ఎదిగిన పంట ఎండిపోతున్నది.
దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ ని స్పృహలు నెలకొన్నాయి. పంటకు పెట్టిన పెట్టుబడును తడిసి మోపెడు కావడంతో అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నాడు. గత ఏడాది అధిక వర్షాల వల్ల పత్తి పంట ఎకరానికి కేవలం 3 నుండి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా ఈ ఏడాది 2 క్వింటాళ్లు వస్తుందో రాదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికంది పంట ఎండిపోతుండడంతో రైతు దిగాలుగా ఉన్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులు పుట్టక రైతన్న సతమతమవుతున్నాడు.....
మార్కెట్లో ధర ఉన్న దిగుబడి రాక.....
పత్తి పంటకు బహిరంగ మార్కెట్లో క్వింటాలు 9260 రూపాయలు ధర పలుకుతున్నది. అయితే పంటకు ధర ఉన్న దిగుబడి లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట మొదట మురిపించిన ఆ తర్వాత ఏడిపిస్తున్నదని రైతులంటున్నారు. కష్టం చేసి పంటను కాపాడుకుంటున్న చివరికి వర్షాలు కురవకపోవడంతో పంట చేతికి అందకుండా పోతున్నదని రైతులు అంటున్నారు. రైతు దీనస్థితిలో ఉన్నాడని ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఆత్మహత్యలకు దారి తీస్తాయని వాపోతున్నారు....
రైతుల నాదుకోవాలి....
పత్తి పంట దిగుబడి రాకపోగా రబి పంట సహితం వచ్చేదిగా లేదని రైతుమదన పడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదని. రైతులంటున్నారు. జిల్లాని కరువు ప్రాంతం గా ప్రకటించి రైతన్న ఆదుకోవాల్సిన అవసరం ఉందని రైతు నాయకులు డి రామ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయని వేసవిలో పశువులకు త్రాగునీటి ఎద్దడి వచ్చే ఆస్కారం ఉందని అంటున్నారు. ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.