గ్రాడ్యుయేట్ ఓటు నమోదుపై అవగాహన

23-10-2026 | 05:37pm

ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి

బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు 

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 23 విజయక్రాంతి : వెంకటాపురం మండల(Venkatapuram Mandal) కేంద్రంలో జడ్ పి ఎస్ ఎస్ హైస్కూల్(ZPSS High School) టీచ్చర్స్  జూనియర్ కాలేజి లెక్చరర్స్ ని కలవటము జరిగింది శుక్రవారం  బి ఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమంపై(Graduate Voter Registration Program) సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకటాపురం  బి ఆర్ఎస్పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు మాట్లాడుతూ, రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల(MLC graduate elections) దృష్ట్యా 18 సంవత్సరాలు నిండిన, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా గ్రాడ్యుయేట్ ఓటుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రాడ్యుయేట్ ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. విద్యావంతులందరూ ఓటు నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.  బి ఆర్ఎస్ పార్టీ తరఫున మండలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఓటు నమోదు చేయిస్తాం" అని తెలిపారు.అనంతరం పలువురు యువకులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు తమ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో  బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన విభాగం నాయకులు,గెడ్డంవివేక్.మంచర్లనాగేశ్వరావు. బట్ట నాగేందర్ యూత్ అధ్యక్షులు కొండగొర్ల నాని. కూసం దుర్గాప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు