కొమురవెల్లి స్టేజి వద్ద బస్సు ప్రమాదం

19-09-2026 | 12:09am

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పొన్నం ఆదేశం

కొండపాక, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కొమురవెల్లి స్టేజి వద్ద సికింద్రాబాద్‌–సిద్దిపేట మధ్య ప్రయాణిస్తున్న సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆరా తీశారు. ప్రమాద వివరాలను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్టీసీ ఎండీతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు.

ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను అధికారులు వెంటనే సిద్దిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందించడంతో పాటు, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు