విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా బోధన సాగాలి

19-09-2026 | 12:27am

మండల విద్యాధికారి రాజు నాయక్

మహమ్మదాబాద్: సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండల పరిధిలోని యూపీఎస్ గాదీర్యాల్, యూపీఎస్ చౌదర్పల్లి పాఠశాలలను మండల విద్యాధికారి రాజు నాయక్(Mandal Educational Officer Raju Naik) సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఫ్లన్, లిప్ రెమిడియేషన్ క్లాసెస్ తదితర కార్యక్రమాలను పరిశీలించారు.

ప్రతి విద్యార్థికి తరగతిస్థాయి సామర్థ్యాలు తప్పనిసరిగా అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెమిడియేషన్ తరగతులు నిర్వహించాలని తెలిపారు.

అదేవిధంగా, తరగతిలో ఏ విద్యార్థి గైర్హాజరైనప్పటికీ వెంటనే వారి తల్లిదండ్రులకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించి, ప్రతి విద్యార్థి 100 శాతం పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కూడా ఆయన తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు. అనంతరం ప్రీ-ప్రైమరీ పాఠశాలను సందర్శించి, చిన్నారులకు అభినయ గేయాలు, ఆటపాటల ద్వారా ఆసక్తికరంగా విద్యాబోధన చేయాలని ప్రీ-ప్రైమరీ ఇన్‌చార్జికి సూచించారు.

మరిన్ని వార్తలు