ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
– ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమం(Prajavani program)లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు(ITDA Utnoor PO Manda Makarand) అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
గాదిగూడ మండలం(Gadiguda Mandal) లొద్దిగూడ గ్రామానికి చెందిన కొడప కన్ను తనకి బావి, బీటీ రోడ్డు మంజూరు కల్పించామని దరఖాస్తు చేశారు. సిరికొండ మండలం రాయిగూడ గ్రామానికి చెందిన కోసేరావు తనకి ఏదైనా గురుకులంలో ఉద్యోగం కల్పించమని విన్నవించారు. గుడిహత్నూరు మండలం సోయంగూడ గ్రామానికి చెందిన చంపత్ రావు తనకి విద్యుత్ కనెక్షన్ బోర్వెల్ ఇప్పించమని కోరారు.
మండలం దుబాయ్ గ్రామానికి చెందిన కార్లే సంధ్య తనకి ఏదైనా ఫార్మర్సిస్ట్ ఉద్యోగం ఇప్పించమని కొరకు దరఖాస్తు అందజేశారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు.