కొమరం భీమ్ వర్ధంతిని విజయవంతం చేద్దాం
బోథ్, అక్టోబర్ 24 ( విజయక్రాంతి): ఈనెల 26న జరపనున్న కొమురం భీమ్ వర్ధంతి సభను(Komaram Bheem Death Anniversary Meeting) సభను విజయవంతం చేసేందుకు గాను ప్రతి ఒక్కరు కృషి చేయాలని న్యాయవాది పి .శంకర్(Advocate P. Shankar) పిలుపు ఇచ్చారు. శనివారం మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి ప్రతి ఆదివాసి ఆదివాసి నాయకులు, ఉపాధ్యాయ సంఘం బాధ్యులు, మహిళా సంఘం నాయకులు, గ్రామాల పటేళ్ళు, దేవరీ, మహాజన్లు హాజరుకావాలని కోరారు.
కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు పోరుగంటి స్వామి, సార్ మేడి ఆడే భీమ్రావు, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు బండారి శ్రీధర్ రెడ్డి , కరత్వాడ సర్పంచ్ ధ్రువ విశ్వేశ్వర్ ,పిప్పల్ దరి సర్పంచ్ అనసూయ, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.