భీమ్ వర్ధంతికి పటిష్ట బందోబస్తు

24-10-2026 | 05:22pm

ఎస్పీ నితికా పంత్

600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

ఆసిఫాబాద్‌, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఆదివాసీ వీరుడు కుమురం భీమ్(Kumuram Bheem) వర్ధంతి సందర్భంగా జోడేఘాట్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లా పోలీస్ శాఖ(District Police Department) ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్(District SP Nitika Pant) తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు(Devotees), సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.శనివారం జోడేఘాట్‌లో  భద్రతా ఏర్పాట్లను ఎస్పీ  పరిశీలించారు.

కార్యక్రమ ప్రాంగణం, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ తదితర అంశాలను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణను సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, భద్రతా సిబ్బంది సూచనలను పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  డీఎస్పీ అశోక్, వాంకిడి సీఐ వేణుగోపాల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీష్, కెరమెరి ఎస్‌ఐ రాజుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు