అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాపై పిడి యాక్ట్ అమలు
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 24 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలో(Karimnagar town) సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసులో(Robbery case) నిందితులైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై కరీంనగర్ పోలీస్ కమిషనర్(Karimnagar Police Commissioner) పిడి యాక్ట్ అమలు(Enforcement of the PD Act) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గత జూలై 21, 2026 అర్ధరాత్రి వేళ కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్లో నివాసముంటున్న మహ్మద్ అజ్మత్ అలీ ఇంట్లో మహ్మద్ రజావుద్దీన్ (44), మహ్మద్ అజీమ్ రజా (24), సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), సల్మాన్ @ విమన్ (22), మహ్మద్ హసీన్ (19) లు వృద్ధులు, మహిళలను విచక్షణారహితంగా కొట్టి బంధించి రూ. 25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, రెండు మోటార్ సైకిళ్లతో సహా సుమారు రూ. 43 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు.
ఈ దోపిడీ కేసులో పోలీసులు ఆగస్టు నెలలో ఆ ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి కరడుగట్టిన నేరస్థులపై కఠిన చర్యల్లో భాగంగా శనివారం పోలీస్ కమిషనర్ పిడి యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను కరీంనగర్ జిల్లా జైలు నుండి చర్లపల్లి కేంద్ర కార్గారానికి తరలించారు.