కాంగ్రెస్కు నరేందర్రెడ్డి రాజీనామా
24-09-2026 | 04:42pm
బెజ్జంకి, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి(Congress Party primary membership) బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామానికి చెందిన చెలుకల నరేందర్రెడ్డి(Chelukala Narender Reddy) రాజీనామా ప్రకటించారు. గత పదేళ్లుగా కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసి, కళ్లేపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా, అనంతరం మండల జనరల్ సెక్రటరీగా సేవలందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపు కోసం పార్టీ బలోపేతానికి కృషి చేసినప్పటికీ, ప్రస్తుతం సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారని పేర్కొంటూ మనస్తాపంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.