‘తప్పుడు ప్రచారం చేశారు’.. హరీశ్‌రావు ఫైర్

24-09-2026 | 04:39pm

హైదరాబాద్: నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు(Harish rao ) గురువారం హాజరయ్యారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud), అద్దంకి దయాకర్ పై పరువునష్టం దావా వేశారు. పరువునష్టం కేసు(defamation case)లో తన వాంగ్మూలం హరీశ్ రావు ఇచ్చారు. అనంతరం కోర్టు దగ్గర నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. తను క్షుద్ర పూజలు చేశానని తప్పుడు ప్రచారం చేశారని పేర్కొంటూ పరువు నష్టం కేసు వేసినట్లు తెలిపారు. 

మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ పై అన్ని సాక్షాలతో కేసు వేశానని, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రజా సమస్యల నుంచి దృష్టి పూర్తిగా డ్రైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, మూడేళ్లు గడిచినా ఈ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ ను నియమించలేదని ఆయన విమర్శించారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టించుకోలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఆరోపించారు. దానం నాగేందర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని, ఇప్పటికైనా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనువిప్పు కావాలని, వారందరికీ దానం నాగేందర్ పరిస్థితే వస్తుందని ఆయన విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు