5 September, 2026 | 2:48 PM

బంజారాల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ ఉత్సవాలు

05-09-2026 | 01:47pm

ఉట్నూర్, సెప్టెంబర్ 05( విజయక్రాంతి):   బంజారాల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా తీజ్ ఉత్సవాలు(Teej celebrations) నిలుస్తున్నాయి. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి నుండి కృష్ణాష్టమి వరకు బంజారా తాండలలో బంజారా యువతులు తీజ్ ఉత్సవాలను  తొమ్మిది రోజుల(Nine day)పాటు ఘనంగా నిర్వహించారు. తీజ్ ఉత్సవాల సందర్భంగా  తండాల్లో ని యువతులు తండా నాయక్ ఇంటి వద్ద  వెదురు గుళ్ళలో గోధుమ మొలకలు వేశారు. తొమ్మిది రోజులపాటు పెరిగిన  గోధుమ  మొలకలతో  ప్రత్యేక నృత్యాలు చేసి  తీజ్ ఉత్సవాలకు శనివారం ముగింపు పలికారు.

మరిన్ని వార్తలు