16 August, 2026 | 3:42 AM

Districts - Adilabad

article_26767642.webp
ఐక్యంగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

బోథ్. ఆగస్ట్ 15 ( విజయక్రాంతి): ఆదివాసి గిరిజన గ్రామాల పటేండ్లు ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించాలని న్యాయవాది పంద్రం శంకర్ కోరారు. ఆగస్టు 9న జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని విజయ వంతం చేసేందుకు సహకరించిన గ్రామాల పటేళ్లను ఆయా గ్రామాల రాయి సెంటర్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యంగా ఉండి కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ఇదే విధమైన సహకారం ఉండాలని కోరారు. కార్యక్రమంలో పాట్నాపూర్ సార్మెడి భీమ్రావు రిటైర్డ్ ఉద్యోగులు మందడి నాగరావ్ పెందూరు సోనేరావు వెంకట్రావు సర్పంచ్లు విశ్వేశ్వరరావు పెందుర్తి పృథ్వి మెస్రం కృష్ణ మాజీ సర్పంచ్ గోపాల్ మండాడి రాము కడప రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

15-08-2026

article_73783249.webp
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేద్దాం

బోథ్. ఆగస్ట్ 15 (విజయక్రాంతి): దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని వారి ఆశయాల కనుగుణంగా మనం ఐకమత్యంతో అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి స్వాతంత్ర ఫలాలను అందించాలన్నారు. ప్రతి పేదవాడికి స్వాతంత్ర ఫలాలు అందితేనే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అవుతుందన్నారు.

15-08-2026

article_15518487.webp
దేశ భవిష్యత్తుకు పునాదులు మీరే.... ఉన్నదులుగా ఎదిగితే దేశం అభివృద్ధి.!

బోథ్ ఆగస్టు 15 (విజయక్రాంతి): దేశ భవిష్యత్తుకు విద్యార్థులే పునాది అని పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నతులుగా ఎదగాలంటే లక్ష్యంతో చదివి దేశం అభివృద్ధి కోసం పాటుపడాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వేదం పాఠశాలలో ఏర్పాటు అయిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వాతంత్ర పొలాలు అందరికీ అందాలని 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతుందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతుందంటే యువతరం కృషి ఎంతగానో ఉందన్నారు.

15-08-2026

article_28894364.webp
సోనాల మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బోథ్ ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సోనాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు గ్రామపంచాయతీలలో సర్పంచులు జెండా ఆవిష్కరించగా మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో మల్లేష్ ఎంపీడీవో రత్నాకర్ రావులు జాతీయ జెండాలను ఎగరవేశారు. వివిధ పాఠశాల విద్యార్థులు దేశభక్తి నినాదాలు చేస్తూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు స్వతంత్ర దినోత్సవ వేడుకల గురించి విద్యార్థులకు వివరించారు. స్వాతంత్రం తీసుకువచ్చేందుకు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారని వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

15-08-2026

article_84948027.webp
ఏజెన్సీలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఉట్నూర్, ఆగస్టు 15(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామపంచాయతీ కార్యాలయంలో పాఠశాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో పిఓ మంద మకరందు, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్, ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రితిక్ సాయి కొట్టే, తహసిల్దార్ కార్యాలయంలో రఘునాథ్ రావు, ఇంద్రవెల్లిలో ప్రవీణ్ కుమార్ ల తోపాటు పోలీస్ స్టేషన్లో ఎస్సైలు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోలు, సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

15-08-2026