వాల్మీకి జయంతి వేడుకలు

26-10-2026 | 12:56pm

బోథ్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మండలంలోని కౌట(బి) గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను (Valmiki Jayanti Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వాల్మీకి జీవితం నేటి సమాజానికి ఆదర్శమని అన్నారు. ఆయన జీవితంలో వచ్చిన మార్పు వల్ల రామాయణాన్ని రచించగలిగారని తెలిపారు. వాల్మీకి జీవితం (Life of Valmiki) ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మల్లెపూల రమేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కొర్రి వెంకటి, ఉపాధ్యక్షుడు టీ. భీముడు, ప్రధాన కార్యదర్శి సున్నపు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు జెట్టి రాజేశ్వర్, మాజీ సర్పంచ్ లంకటి నరసయ్యతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. వాల్మీకి ఆశయాలను (Valmiki's Ideals) స్మరించుకుంటూ జయంతి వేడుకలను నిర్వహించారు.

మరిన్ని వార్తలు