నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్
పాల్వంచ (విజయక్రాంతి): మౌలిక సదుపాయాల కల్పనకే ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి(Corporator Kothwala Vimaladevi) అన్నారు. సోమవారం గడియకట్ట ప్రాంతంలో నూతనంగా మంజూరైన సిమెంట్ రోడ్ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ, వారికి మౌళిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తున్నానన్నారు. గతంలో చేపట్టిన, అసంపూర్తిగా మిగిలివున్న రోడ్లు, డ్రైన్ లను సంపూర్ణంగా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ గంగుల త్రిదేవ్, గడియకట్ట ప్రాంత నాయకులు డాక్టర్ మస్తాన్, బర్ల పాపారావు, బర్ల అన్వేష్, తాళ్లూరి సుధాకర్, సాబేర, అపరిచింతల శివ, కృష్ణ వేణి, పావని తదితరులు పాల్గొన్నారు.