45 రోజుల్లోగా బియ్యం బకాయి చెల్లించాలి

27-10-2026 | 12:09am

మహబూబాబాద్ (విజయక్రాంతి): డిఫాల్ట్ మిల్లర్లు ప్రభుత్వానికి బకాయి పడ్డ సీఎంఆర్ బియ్యం(CMR Rice) 45 రోజుల్లోగా చెల్లించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే.అనిల్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రోజువారి బియ్యం చెల్లింపు విషయంపై మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మిల్లర్లు సిఎంఆర్ రైస్ కోటా చెల్లించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రమేష్, జిల్లా పార్వ సరఫరాల శాఖ మేనేజర్ మనోజ్ కుమార్, ఉపతహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు