రామచంద్రాపురంలో డీపీఓ తనిఖీలు
అశ్వాపురం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): మండలంలోని రామచంద్రాపురం(Ramachandrapuram) గ్రామపంచాయతీని మంగళవారం డీపీఓ అనూష(DPO Anusha ) సందర్శించి అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న వీవో భవన పనుల పురోగతిని తెలుసుకోవడంతో పాటు కొత్త పింఛన్ల దరఖాస్తులను పరిశీలించారు.
అర్హులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పంచాయతీ రికార్డులను తనిఖీ చేసి, అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ముత్యాలరావు, సర్పంచ్ బురెడ్డి స్వాతి, పంచాయతీ కార్యదర్శి తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.