‎సింగరేణి ఉద్యోగి సొంతింటి కలను సహకారం చేసిన ప్రజా ప్రభుత్వం

13-10-2026 | 04:36pm

ప్రజా భవన్ లో ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఐటి పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

‎మంథని, అక్టోబర్ 13(విజయ క్రాంతి)‎: సింగరేణి ఉద్యోగి సొంతింటి కలను సహకారం చేసినని ప్రజా ప్రభుత్వమేనని, బిఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) కాంట్రాక్టు కార్మికులను గుర్తించలేదని, ‎‎పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) మారుపేరుల సమస్యను ఎందుకు పట్టించుకోలేదని ప్రజా భవన్ లో (Praja Bhavan)మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఐటి పరిశ్రమలు,

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‎‎సింగరేణి ఉద్యోగులు కార్మికుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న బిఆర్ఎస్ కారుణ్య  నియకాలపై బిఆర్ఎస్ రాజకీయం తగదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2437 నియామకాలు చేపట్టామని, ‎మా ‎ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సింగరేణిలో 31 89 పోస్టులను భర్తీ చేశామని, ‎‎

752 ఎక్స్ టర్నల్ పోస్టులు ఉండగా 2437 కారుణ్య నియామక ఉద్యోగాలను భర్తీ చేశామని, ‎‎సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కోసం రూ. 40 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నామని, ‎‎కోల్ ఇండియా ఉద్యోగులకూ లేనటువంటి ప్రమాద బీమా కోటి 20 లక్షలు సింగరేణి కార్మికులకు కల్పిస్తున్నమని, ‎‎

అధికారంలో ఉన్న పది సంవత్సరాలు బిజెపితో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన బిఆర్ఎస్ కొత్త గనులను ఎందుకు తీసుకురాలేదని, ‎‎కేంద్రంతో సరైన సహకారం అందనప్పటికీ ప్రజా ప్రభుత్వం కొత్త బ్లాక్ లను తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణి కోసం... సింగరేణి కార్మికుల కోసం చేసిందేం లేదన్నారు. 

సింగరేణి కోసం... సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మేం చేసే ప్రతి పనిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందని, మీరు అధికారం లో ఉన్నప్పుడు సింగరేణిని ఎలా బ్రష్టు పట్టించారో రేపు సభలో చెప్పలని, సింగరేణిని కాపాడుకుంటామని, సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

మరిన్ని వార్తలు