హైదరాబాద్ ట్రాఫిక్‌పై యువతి ఫన్నీ పంచ్! వీడియో వైరల్

13-10-2026 | 03:29pm

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ (Traffic) కష్టాలు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు ఎలాంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా రోడ్లు మూసివేస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఇదే విషయంపై ఓ యువతి తనదైన హాస్యశైలిలో ట్రాఫిక్‌ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. రోడ్లు మూసివేయొద్దంటూ ఆమె చేసిన అభ్యర్థనతో పాటు, వీడియోలో (Video) ఆమె పలికించిన హావభావాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

మాటల్లో తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే, హావభావాలతో నవ్వులు పూయించింది. రోడ్లు మూసివేసే ముందు వాహనదారులకు సమాచారం (Information) ఇవ్వాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ముందస్తు సమాచారం అందిస్తే వాహనదారులకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ యువతి వినూత్న విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో (Social Media) చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు