దుండగులను శిక్షించాలి

13-10-2026 | 04:20pm

బెజ్జంకీ, అక్టోబర్ 13: మెదక్ పట్టణంలోని ఆటోనగర్‌లో వీరనారి చాకలి ఐలమ్మ(Heroic Woman Chakali Ailamma) విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని సిద్దిపేట జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్యని ఖండించారు. విగ్రహానికి రక్షణ కల్పించి, దెబ్బతిన్న విగ్రహాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు