గాంధీ బొమ్మ సెంటర్లో ఘనంగా అన్నదానం
13-10-2026 | 04:28pm
దమ్మపేట, అక్టోబర్ 13(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని(Mandal headquarters) గాంధీ బొమ్మ సెంటర్ లో(Gandhi Statue Center) నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజైన మంగళవారం అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో కొలువు దీరారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దారా ప్రసాద్, పసుమర్తి సత్తిపండు, యార్లగడ్డ ఈశ్వరావు, దారా శ్రీనివాసరావు, దారా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.