మున్సిపల్ కార్పొరేషన్ లో వైద్య శిబిరం విజయవంతం...

30-09-2026 | 10:01pm

కార్మికుల ఆరోగ్య, సంక్షేమ నికి ప్రాధాన్యత...మేయర్ మూడ్ గణేష్

కొత్తగూడెం సెప్టెంబర్ 30 విజయ క్రాంతి: కార్మికుల ఆరోగ్య రక్షణకు మున్సిపల్ కార్పొరేషన్ అధిక ప్రాధాన్యతనిస్తుందని, నిరంతరం శ్రమిస్తూ పట్టణ ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బంది శ్రేయస్సుకు, అన్నివేళలా అండగా ఉంటామని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్(Kothagudem Corporation Mayor Mood Ganesh) అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం కార్పొరేషన్ పరిధిలోని శానిటరీ, వాటర్ సప్లై, విద్యుత్ సరఫరా, ఆఫిస్ సిబ్బంది, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరాన్ని మేయర్ మూడ్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యం కోసం రేయింబవళ్లు కష్టపడే పలు విభాగాల, కార్మికులు తమ సొంత ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్మికుల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కార్పొరేషన్ యంత్రాంగం కృషి చేస్తుందని పేర్కొన్నారు. 

కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది శిబిరంలో పాల్గొని సుమారు 300 మంది కార్మికులకు రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించి,ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ సుజాత, కార్పొరేషన్, జీజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు